- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KL Rahul: లక్నో జట్టును వీడనున్న కేఎల్ రాహుల్!.. ప్రధాన కారణం అదేనా?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-20242లో ఎడిషన్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్ వేదికగా ఉప్పల్ మైదనంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జాయింట్స్ జట్టు తలపడ్డాయి. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఏ మాత్రం తడబడకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 166 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు వచ్చి రాగానే లక్నో బౌలర్లపై ఓ యుద్ధాన్నే ప్రకటించినట్లుగా ఎదురుదాడికి దిగారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ.. స్టేడియాన్ని ఉర్రూతలూగించారు. దీంతో హైదరాబాద్ జట్టు కేవలం 9.4 ఓవర్లలోనే టార్గెట్ చేధించింది.
ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిశాక గ్రౌండ్‌లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అప్పటి వరకు స్టాండ్స్‌లో మ్యాచ్ వీక్షిస్తున్న లక్నో టీం ఓనర్ సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చేశాడు. వస్తూ.. రాగానే కెప్టెన్ రాహుల్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇలా బౌలింగ్ చేస్తున్నారంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక రాహుల్ ఆయనకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. అయితే, అందుకు సంబంధించిన వీడియో ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ విషయం అటుంచితే గ్రౌండ్‌లో జరిగిన గొడవ పట్ల రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మ్యాచ్ ఓడినంత మాత్రానా.. టీం ఓనర్ సంజీవ్ గోయెంకా అలా చేయడం సబబు కాదంటూ టీం సభ్యులతో రాహుల్ అన్నట్లుగా సమాచారం. ఈ పరిణామంతో ఐపీఎల్ ఈవెంట్ ముగిసిన వెంటనే జట్టులోనే ఉంటాడా.. లేక మరేదైనా జట్టులోకి వెళ్తాడా అన్నది సస్పెన్స్‌గా మారింది.