రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన బైక్​....తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు

by Sridhar Babu |
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన బైక్​....తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు
X

దిశ;శంకరపట్నం : ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ మహిళకు తీవ్రగాయలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే... మండలంలోని మక్త గ్రామానికి చెందిన ఎల్కపల్లి నర్సమ్మ తన వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా ముత్తారం గ్రామానికి చెందిన బండ పరుశురాములు తన భార్య తో ద్విచక్ర వాహనం పై వస్తూ మక్తమత్తడి ప్రాంతంలో నర్సమ్మను వెనక నుండి ఢీ కొట్టాడు. దాంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అది గమనించిన స్థానికులు 108కు సమాచారం అంధిచడంతో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.


Next Story