మాటలు ఎక్కువ చేతలు తక్కువ.. బడ్జెట్‌పై పొన్నాల లక్ష్మయ్య ఫైర్

by Gantepaka Srikanth |
మాటలు ఎక్కువ చేతలు తక్కువ.. బడ్జెట్‌పై పొన్నాల లక్ష్మయ్య ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అని సీతారామన్ ఉటంకించారని.. కానీ బడ్జెట్ ఆ దిశగా లేదని.. కొద్ది మందికే లాభదాయకంగా ఉందని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంపన్న వర్గాలకు చెందిన బ్యాంకు రుణాలను మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం నిరుపేదలకు ఈ బడ్జెట్‌లో ఏమిచ్చిందని ప్రశ్నించారు. మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని బడ్జెట్ మరోసారి రుజువు చేసిందన్నారు. కేసీఆర్ మిషన్ భగీరథతో వంద శాతం గ్రామాలకు తాగు నీరు ఇచ్చారని.. జల్ జీవన్ మిషన్ కింద వచ్చే ఎనిమిదేళ్లలో వంద శాతం గ్రామాల్లో తాగు నీరు ఇస్తామని కేంద్రం కాపీ కొట్టిందన్నారు. కేసీఆర్ ముందు చూపుతో జిల్లాకో మెడికల్ కాలేజీ స్థాపించి సీట్ల సంఖ్యను 8,500 దాకా పెంచారని.. కేంద్ర బడ్జెట్‌లో మెడికల్ సీట్లను పెంచుతామని ప్రకటించారని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇస్తామన్న వాటి గురించి ప్రస్తావన లేదన్నారు.


Next Story