స్థానిక ఎన్నికల కోసమే రైతుబంధు డ్రామా..: కేటీఆర్

by Aamani |
స్థానిక ఎన్నికల కోసమే రైతుబంధు డ్రామా..: కేటీఆర్
X

దిశ, కుల్కచర్ల : కుల్కచ‌ర్ల మండ‌ల ప‌రిధిలోని దాస్యా నాయ‌క్ తండాలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ నాయక్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని శనివారం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర నాయకులతో కలిసి ఆవిష్క‌రించారు.అనంతరం తండాల కొలువైన సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గజమాలతో నాయకులు ఘనంగా సన్మానించారు.అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... బోధించు, స‌మీక‌రించు,పోరాడు,అని చెప్పిన అంబేద్క‌ర్ పోరాట స్ఫూర్తిని ఆచ‌ర‌ణ‌లో పెట్టింది కేసీఆర్ రేనని 14 సంవత్సరాలు అహింసాయుతమైన ప‌ద్ధ‌తుల్లో చావు నోట్లో త‌ల‌పెట్టి అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం లోని ఆర్టిక‌ల్ 3 ద్వారా తెలంగాణ సాధించి గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా కేసీఆర్ చేశారన్నారు.

యావత్ భారతదేశానికి స్వేచ్ఛనిచ్చిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు వేయడానికి సిద్ధంగా ఉంటే కోర్టులో కేసు వేసి రైతుబంధు నిలిపివేసి అధికారంలోకి వచ్చాక మేమే ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ 100 శాతం రెండు లక్షల రుణమాఫీ ఏ ఒక్కరికి చేయలేదన్నారు. ఏ రైతుకైనా 2లక్షల రుణమాఫీ జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూ.7వేల600 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కేవలం కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు.కాంగ్రెస్ చేస్తున్న దౌర్జన్యాన్ని అడుగడుగున అడ్డుకుంటామని రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో చర్చలకు సిద్ధమా అని ఘాటుగా విమర్శించారు.అబద్ధాల రేవంత్ రెడ్డిని పికలిచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.కెసిఆర్ కట్టే లేకుండా నడుసుడు కాదు... నీకు చేతనైతే కమిషన్లు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించు అని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ అంటే ఒక హిస్టరీ,రేవంత్ అంటే లాటరీ అన్నారు.

కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో నీ పాత గురువుని అడుగు లేదా, మీ బాస్ రాహుల్ గాంధీ వల అమ్మని అడుగు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని సంవత్సరం గడుస్తుంది హనీమూన్ పిరియడు ముగిసింది ఇకనైనా ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించాలన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తే తులం బంగారం,మహాలక్ష్మి పథకం,రుణమాఫీ, రైతు భరోసా హామీలపై నిలదీయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కెసిఆర్ పేరు చిరస్మరణీయంగా ఉంటుందని అన్నారు.

త్వరలో మళ్లీ కలుసుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ అలీ, బల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, రజిని సాయిచంద్, కొప్పుల అనిల్ రెడ్డి, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాయక్, మాజీ జెడ్పిటిసి రాందాస్ నాయక్, చౌడపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల నాయకుడు కే బి రాజు, శంకర్ నాయక్, సారా శ్రీనివాస్, వివిధ గిరిజన సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Next Story