- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యాక్సిడెంట్‌కు గురైన సల్మాన్ ఖాన్ చెల్లి.. కదలలేని స్థితిలో ఉన్నానంటూ ఎమోషనల్ పోస్ట్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఫ్రెండ్ సునీల్ రోహిరా(Sunil Rohira) కూతురు శ్వేతా ఆయనను అన్నయా అని పిలుస్తుందన్న విషయం తెలిసిందే. సునీల్ మరణించాక శ్వేత యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. ప్రతి రాఖీ పండుగకు ఆమె సల్మాన్ ఇంటికి చేరుకుని పండుగ సెలబ్రేట్ చేసుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్వేత రోహిరా యాక్సిడెంట్‌కు గురైంది. ఆమె ముంబై రోడ్లపై తీవ్రంగా గాయపడింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించింది. ‘‘నాకు యాక్సిడెంట్ జరగడం వల్ల హాస్పిటల్‌లో ఉన్నాను.
ఎముకలు విరిగాయి.. సర్జరీలు కూడా జరిగాయి. కదలలేని స్థితిలో ఉన్నా. నేను నటించాలని కోరుకున్నాను. నిజం ఏమిటంటే, కొన్నిసార్లు జీవితం మనల్ని విచ్ఛిన్నం చేయడానికి, మనల్ని బలంగా పునర్నిర్మించడానికి మాత్రమే కదిలిస్తుంది. విశ్వాసంతో జీవిస్తున్నాను.. ఆశను పట్టుకొని, బాధను తట్టుకుని నవ్వుతూ కనిపిస్తున్నా. ఇది కూడా గడిచిపోతుందని నాకు గుర్తు చేసుకుంటున్నాను. జీవితం వంకరగా తిరుగుతుంది, కానీ వారు సినిమాల్లో చెప్పినట్లు, “చిత్రం అభి బాకీ హై, మేరే దోస్త్’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం చెల్లికి యాక్సిడెంట్ అయి నాలుగు రోజులవుతుంటే సల్మాన్ స్పందించకపోవడం ఏంటని విమర్శలు చేస్తున్నారు. కాగా, శ్వేత సినిమాల్లో నటించనప్పటికీ సల్మాన్ చెల్లిగా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్టులతో ఎంతోమంది ఫాలోవర్స్‌ను పెంచుకుంది.