- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
47 క్రిప్టొ కరెన్సీ ఎక్సేంజీల మాత్రమే లీగల్: టీజీసీఎస్బీ డీజీ
by srinivas |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)తో నమోదు చేయబడిన 47 క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల మాత్రమే లీగల్‌గా ఉన్నాయని టీజీసీఎస్బీ డీజీ శిఖా గోయల్ తెలిపారు. ధృవీకరణ లేని ప్లాట్‌ఫారమ్‌లతో పెట్టుబడులు పెడితే ఆర్ధికంగా నష్ట పోయే ప్రమాదం ఉందిన తెలిపారు. క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లపై సైబర్ పబ్లిక్ అడ్వైజరీ జారి చేసినట్లు శనివారం పత్రిక ప్రకటనలో చెప్పారు. క్రిప్టోకరెన్సీ జనాదరణ పొందడంతో, నేరస్థులు పోంజీ పథకాల ద్వారా నకిలీ ఎక్స్ఛేంజీలతో దోపిడీ చేస్తున్నారని తెలిపారు. క్రిప్టోకరెన్సీ స్కామ్‌ల గురించి , సమాచారం గురించి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసాన్ని గుర్తించనట్లయితే వెంటనే 1930 లేదా cybercrime gov.inకి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Next Story