పిల్లలతో మనసు విప్పి మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలు ఓపెన్ అవ్వొద్దు..?

by Anjali |
పిల్లలతో మనసు విప్పి మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలు ఓపెన్ అవ్వొద్దు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఉద్యోగులు చాలా మంది పిల్లలతో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నారన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలతో సమయం గడుపుతారు. ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు. ఈ క్రమలో తమ అనుభవాలు కూడా పంచుకుంటూ ఫన్నీ కామెంట్లు చేసుకుంటారు.

అయితే ఈ క్రమంలో తల్లిదండ్రులు వారికి తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. పేరెంట్స్ కు ఆ విషయాలు నార్మల్‌గా అనిపించినప్పటికీ.. పిల్లల ప్రభావం చూపుతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాలు పిల్లల్ని ప్రమాదంలో పడేసే ప్రమాదముందని అంటున్నారు.

పిల్లల చెవిన పడకుండా ఉండే ఈ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పేరెంట్స్ ఎప్పుడూ కూడా ప్రమాకరమైన స్టోరీలు చెప్పకూడదు. అవి వారి ప్రవర్తన మీద ప్రభావం చూపుతుంది. అలాగే మనీకి సంబంధించిన చెడు నిర్ణయాలు గురించి మాట్లాడకుండా ఉండాలి. ఆర్థిక పోరాల కథలు.. తరచూ డబ్బు గురించి మాట్లాడటం వల్ల.. పిల్లల మనస్సు డబ్బుపై ఆశతో ఏ పని చేయడానికి అయినా సిద్ధపడుతుంటారు.

అలాగే అప్పులు ఉంటే ఇంట్లో పరిస్థితుల గురించి పిల్లల ముందు మాట్లాడకూడదు. పిల్లలు ఇలాంటి విషయాలు పట్ల ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా తిరుగుబాటుకు సంబంధంచిన స్టోరీలు చెప్పకూడదు. అలాగే మేము పాఠశాలకు వెళ్లే సమయంలో స్కూల్ బంక్ కొట్టేదంటూ ఫన్నీగా కూడా పిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పొద్దు. ఈ విషయాలు పిల్లల మనసులో బలంగా నాటుకుపోయాని నిపుణులు చెబుతున్నారు.

కాగా పిల్లలకు జీవితం గురించి ముందుకు సాగేలా ఏదైనా సాధించగలం అనే నమ్మకం గల విషయాలు చెప్పాలి. పిల్లల్లో సత్ర్పవర్తనను, ప్రేరణను నింపే స్టోరీలు చెప్పాలి. ఉదాహరణలతో వివరించాలి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.


Next Story