- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్యాటరీ దొంగలు దొరికారు

దిశ,బెల్లంపల్లి : ఆసిఫాబాద్ జిల్లాలోని మూసివేసిన రేపల్లె వాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని రైల్వే ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ నుంచి 55 ఎలక్ట్రికల్ బ్యాకప్ బ్యాటరీలు దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన వివరాలను రామగుండం ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ బుర్ర సురేష్ గౌడ్ శనివారం బెల్లంపల్లి ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ లో వెల్లడించారు. జనవరి 31న మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రేచిని రోడ్-ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్ల మధ్య ఉన్న రేపల్లె వాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో 1,55 విలువైన బ్యాటరీలు చోరీకి గురయ్యాయి.
బెల్లంపల్లి ఆర్పీఎఫ్ ఎస్సై డి. నరేందర్, రామగుండం ఎస్సై క్రాంతి కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఐలయ్యలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దొంగతనం జరిగి మూడు గంటల్లోనే నిందితులను పట్టుకున్నామన్నారు. దొంగతనానికి పాల్పడిన మోటం శ్రీను, తిరుపతి మహేష్ లను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు తాండూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన వారని వివరించారు. ఈ ఘటనలో నిందితుల నుంచి రూ. లక్ష విలువైన 55 బ్యాటరీలు, దొంగతనానికి ఉపయోగించిన ఓమ్ని వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.