- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్
బెంగళూరు: దేశ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. తూర్పు లడాఖ్‌లో కవ్వింపుల నేపథ్యంలో చైనాను ఉటంకిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పరిష్కారం కాని సరిహద్దుల వెంట యథాతథ స్థితిని మార్చడం కోసం విదేశీ సైన్యాలు పనిగట్టకుని ప్రయత్నాలను చేస్తుండటం మనం గమనించాం. కానీ, భారత్ అప్రమత్తంగా ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం. మన ప్రజలను కాపాడటం కోసం ఎలాంటి దుస్సాహసానైనా ఎదుర్కొంటాం. ఏదిఏమైనా సరిహద్దుల సమగ్రతకు కట్టుబడి ఉన్నాం అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బుధవారం బెంగళూరులో ఎయిర్ ఇండియా షోను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం ప్రపంచ సమస్యగా అభివర్ణించిన రాజ్‌నాథ్ సింగ్ ఆ సమస్యను భారత్ విభిన్న ప్రాంతాల నుంచి ఎదుర్కొంటుందన్నారు. ఓ దేశం ఎగదోస్తున్న ఉగ్రవాదానికి భారత్ భాధింపబడుతున్నదని, అది ఇప్పుడు ప్రపంచ భద్రతకు పెనుముప్పుగా మారిందని తెలిపారు.