ఘోర ప్రమాదం.. మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం

by Shyam |
road accident
X

దిశ ప్రతినిధి, మెదక్: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జైంది. దీంతో యువతి మృతదేహం కారులో ఇరుక్కుపోయింది. మృతిచెందిన యువతి నిహారిక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రేన్ సాయంతో కారును పక్కకు తప్పించి ఆ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించారు.

Advertisement

Next Story

Most Viewed