భార్యను గొంతుకోసి.. జుట్టుపట్టుకొని ఈడ్చుకుంటూ.. కారుతో తొక్కి చంపిన భర్త

by Anukaran |   ( Updated:2021-02-21 01:19:44.0  )
భార్యను గొంతుకోసి.. జుట్టుపట్టుకొని ఈడ్చుకుంటూ.. కారుతో తొక్కి చంపిన భర్త
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రేమ..ప్రేమ అంటూ మూడేళ్లు వెంటపడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆపై భేదాభిప్రాయాలు రావడంతో కత్తితో భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు.

తమిళనాడు కోయం బత్తూరుకు చెందిన గోకుల్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గోకుల్ తన బంధువైన కీర్తను ప్రేమించాడు. మూడేళ్ల క్రితం గోకుల్-కీర్తన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో గోకుల్- కీర్తనలను చూసి ఎంతో చక్కటి దాంపత్యమో అనుకున్నారంత. కానీ రోజులు గడిచే కొద్ది ఇల్లరికం వచ్చిన అల్లుడు గోకుల్, కుమార్తె కీర్తనల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఇద్దరికి పిల్లలు లేకపోవడంతో బేదాభిప్రాయాలు తలెత్తి విడిపోయేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో తనకు విడాకులు కావాలంటూ ఆరునెలల క్రితం భార్య కీర్తన కోర్ట్ ను ఆశ్రయించింది. దీంతో భార్య విడాకులు కోరడాన్ని తట్టుకోలేకపోయిన గోకుల్ ఇంట్లో ఉన్న అత్తామామల్ని కత్తితో దాడి చేశాడు. పక్కనే ఉన్న కీర్తనను కత్తితో గొంతు కోశాడు.గొంతునుంచి రక్తం దారాళంగా కారుతున్నా జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రోడ్డుపైన వదిలేశాడు. ప్రాణం పోతున్న బాధితురాలు తనని కాపాడాలని వేడుకుంది. అయినా కనికరించని భర్త తన కారుతో భార్యను ఢీకొట్టాడు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న భార్యను కారుతో తొక్కించి చంపాడు. అనంతరం అక్కడి నుంచి కారులో పరారయ్యాడు.

దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా నిందితుడు గోకుల్ చెన్నై- తిరుచ్చి నేషనల్ హైవేలోని ఆర్థర్ టోల్ బూత్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆచరపక్కం స్టేషన్ పరిధి పోలీసులు గోకుల్ వెహికల్ ను వెంబడించారు. పోలీసుల్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా నిందితుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రగాయాలైన నిందితుడు గోకుల్ ను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed