Manipur: మణిపూర్‌లో ఆగని హింస.. పోలీసులు కాల్పుల్లో నిరసనకారుడు మృతి!

by vinod kumar |
Manipur: మణిపూర్‌లో ఆగని హింస.. పోలీసులు కాల్పుల్లో నిరసనకారుడు మృతి!
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌ (Manipur)లోని జిరిబామ్ (Jiribalm) జిల్లాలో హింస ఆగడం లేదు. తాజాగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ నిరసనకారుడు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అసోంలోని కాచర్ జిల్లాలో ఓ మహిళ, చిన్నారి మృతదేహం లభ్యమవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళన కారులు జిరిబామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుపరా ప్రాంతంలో ఇళ్లను, పలు కార్యాలయాలను ధ్వంసం చేస్తుండగా పోలీసులు వారిపైకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఖుండ్రక్‌పామ్ అథౌబా (20) అనే యువకుడు మరణించగా, బిషన్ అనే వ్యక్తి గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకే పోలీసులు కాల్పులు జరిపారని, బుల్లెట్ తాకిన వ్యక్తి మృతి చెందాడని వెల్లడించారు. దీంతో ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలు క్షీణించడంతో ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలను మూసివేసింది. ఇంఫాల్ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed