Cyber Fraud: రూ.19 వేలకు కక్కుర్తి పడితే.. రూ.10 కోట్లు కాజేశారు

by karthikeya |   ( Updated:2024-11-18 08:41:01.0  )
Cyber Fraud: రూ.19 వేలకు కక్కుర్తి పడితే.. రూ.10 కోట్లు కాజేశారు
X

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని రోజూ ఎంతోమంది లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నా.. పోలీసులు అనుక్షణం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. మోసపోయే వాళ్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వేలు సంపాదించొచ్చు అనే కక్కుర్తితో ఏకంగా లక్షలు, కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. స్థానిక మణికొండలో నివశించే ఓ 30 ఏళ్ల వ్యక్తి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ సైబర్‌ నేరగాడు అతడికి ఫోన్ చేసి.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీగా సంపాదించుకోవచ్చని చెప్పారు. దీంతో బాధితుడు వాళ్ల మాటలు నమ్మి మొదట లక్షతో మొదలుపెట్టి.. కొద్ది రోజుల్లోనే రూ.10 కోట్లు డిపాజిట్ చేశాడు. ఫైనల్‌గా తను మోసపోయానని అర్థమై సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అక్టోబర్ 2న అకౌంటెంట్ ఫోన్ నంబర్‌ను ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా వెల్త్’ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఈ గ్రూప్‌లో చేతన్ సెహగల్ అనే వ్యక్తి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అవగాహన కల్పిస్తూ పెట్టుబడులపై సలహాలు ఇచ్చేవాడు. అతని సహాయకురాలిగా చెప్పుకుంటూ మీరాదత్ అనే పేరుతో మరో వ్యక్తి బాధితునితో నేరుగా మాట్లాడారు. అధిక లాభాల కోసం ‘వీఐపీ ట్రేడింగ్ అకౌంట్’ తీసుకోవాలని ప్రేరేపించి అక్టోబర్ 17న రూ.లక్ష పెట్టుబడి పెట్టించారు. ఆ లక్షకు ఒక్క రోజులోనే రూ.19 వేలు లాభం వచ్చినట్లు వర్చువల్ లాభాలు చూపించారు. దీంతో అదంతా నిజమని నమ్మిన బాధితుడు.. నవంబర్ 4 వరకు మొత్తంగా రూ.10.10 కోట్ల పెట్టుబడులను డిపాజిట్ చేయించుకున్నారు.

వర్చువల్ లావాదేవీలలో రూ.24.36 కోట్ల లాభం వచ్చినట్లు చూపించి, మొత్తం డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే అదనంగా మరో రూ.3 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయాలని అడగడంతో బాధితుడికి తాను మోసపోయానని అర్థమైంది. దీంతో పోలీసులను ఆశ్రయించగా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed