అసభ్య మెసేజ్‌లు..ఆత్మహత్య చేసుకున్న యువతి

by Naveena |
అసభ్య మెసేజ్‌లు..ఆత్మహత్య చేసుకున్న యువతి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. భువనగిరికి చెందిన హాసిని అనే డిగ్రీ విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ లో హాసిని డిగ్రీ చదువుతుంది. గత కొద్దీరోజులుగా ఓ యువకుడు అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ వేధింపసాగినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన హాసిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని..పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed