- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Decathlon: ఇకపై మింత్రాలోనూ డెకథ్లాన్ బ్రాండ్స్
దిశ, బిజినెస్ బ్యూరో: స్పోర్ట్స్ వేరబుల్ ఉత్పత్తులకు యువతలో ఎక్కువ ఆదరణ కలిగిన డెకథ్లాన్ విస్తరణలో భాగంగా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ మింత్రాతో కీలక భాగస్వామ్యం చేసుకుంది. ఈ ఒప్పందంతో ప్రధానంగా టైర్-1, టైర్-2, టైర్-3 నగరాల్లో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని డెకథ్లాన్ క్రీడా దుస్తులు, షూ సహా ఇతర ఉత్పత్తులు మింత్రాలో అందుబాటులో ఉంటాయని, దాదాపు 98 శాతం డెలివరీ సేవలు లభించే పిన్‌కోడ్ ప్రాంతాలకు తమ ఉత్పత్తులు అందిస్తామని కంపెనీ సోమవారం ప్రకటనలో తెలిపింది. ఈ-కామర్స్ విభాగంలో మరింత ఎక్కువమంది కస్టమర్లకు చేరువయ్యే లక్ష్యంలో భాగంగా ఈ భాగస్వామ్యం కుదరడం సంతోషంగా ఉందని డెకథ్లాన్ ఇండియా సీఈఓ శంకర్ ఛటర్జీ అన్నారు. హైకింగ్, ట్రెక్కింగ్, ఫిట్‌నెస్, స్విమ్మింగ్, టెన్నిస్, ఫుట్‌బాల్, రన్నింగ్ సహా 40 కంటే ఎక్కువ స్పోర్ట్స్ ఉత్పత్తులు, బ్యాక్‌ప్యాక్, యాక్సెసరీలు, టీ-షర్ట్, జాకెట్ బ్రాండ్లు మింత్రా ప్లాట్‌ఫామ్‌లో లభిస్తాయని డెకథ్లాన్ వివరించింది.