పెళ్లి ఇంట్లో చోరీ…భారీ ఎత్తున బంగారం, వెండి, నగదు మాయం

by Kalyani |
పెళ్లి ఇంట్లో చోరీ…భారీ ఎత్తున బంగారం, వెండి, నగదు మాయం
X

దిశ, శంకర్పల్లి : శంకర్ పల్లి లోని మున్సిపల్ కౌన్సిలర్ కూతురు పెళ్లి సందర్భంగా బంగారం, వెండి, నగలు కనిపించకుండా పోయిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శంకర్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్శి రాధా బాలకృష్ణ కూతురు పెళ్లి ఉండడంతో ఆదివారం రాత్రి మెహందీ కార్యక్రమం జరిగింది. తదనంతరం దాచి ఉంచిన బంగారం, వెండి, నగలు చూడగా కనిపించకుండా పోయాయి. సుమారు 133 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలు, రెండున్నర లక్షల నగదు కనిపించకుండా పోవడంతో సోమవారం శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ ఆధ్వర్యంలో శంకర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ నార్సింగ్ సీఐ హరి ప్రసాద్ రెడ్డి తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం చేరుకొని సంఘటన జరిగిన తీరు అందుకు గల కారణాలు తదితర కారణాలపై విచారణ కొనసాగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed