Assembly Election : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. రూ.1082 కోట్ల డబ్బు సీజ్ చేసిన ఈసీ

by M.Rajitha |
Assembly Election : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. రూ.1082 కోట్ల డబ్బు సీజ్ చేసిన ఈసీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 20న మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్(Jarkhand) రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Election) జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం నేటితో ముగిసింది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్(EC) భారీగా అక్రమ నగదును సీజ్ చేసింది. దాదాపు రూ.1082 కోట్లకు పైగా విలువైన డబ్బు, మద్యం, ఆభరణాలు, ఇతర వస్తువులు ఈసీ సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి. ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019 ఎన్నికలతో పోల్చితే 7 రెట్లు అధికంగా నగదును స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. సీజ్ చేసిన వాటిలో రూ.182 కోట్ల నగదు, రూ.120 కోట్ల మద్యం, రూ.124 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.303 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.355 కోట్ల విలువైన ఉచితాలు.. ఇతర వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలో రూ.660 కోట్లు.. జార్ఖండ్ లో 198 కోట్లు.. మిగతా చోట్ల జరుగుతున్న ఉప ఎన్నికల్లో రూ.223 కోట్లు ఉన్నట్టు ఈసీ తెలిపింది. కాగా ఎన్నికల రోజు వరకు అని ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed