- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: వైసీపీకి భారీ షాక్... మూకుమ్మడిగా రాజీనామా
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జి. కొండూరు మండలానికి చెందిన నాయకులు మూకుమ్మడిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వాలకు సైతం రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. పైగా పార్టీ కార్యక్రమాలు కూడా చురుగ్గా నిర్వహించకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాజీనామాలు ప్రకటించారు.
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలోని హావేలి ముత్యాలంపాడు గ్రామ సర్పంచ్ కాజా సంధ్యారాణి, మాజీ జెడ్పిటిసి సభ్యులు కాజా బ్రహ్మయ్య, సున్నంపాడు సర్పంచ్, సర్పంచుల సంఘం మైలవరం నియోజకవర్గ అధ్యక్షులు దేశం వెంకట సుధాకర్ రెడ్డి, మునగపాడు సర్పంచ్ పగడాల వెంకటేశ్వరరావు, చెరువు మాధవరం పిఎస్సీఎస్ మాజీ అధ్యక్షులు చుండూరు విష్ణువర్ధనరావు, కందులపాడు ఎంపిటిసి సభ్యులు, మాజీ సర్పంచి గార్లపాటి రమాదేవి, వైకాపా నాయకులు గార్లపాటి వెంకటరావు, కవులూరు గ్రామానికి చెందిన మైలవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు గొట్టుముక్కల ఓంకారబాబు, సీనియర్ వైసీపీ నాయకులు ఈలప్రోలు వెంకటేశ్వరరావు, జి.కొండూరుకు చెందిన మైలవరం ఏఎంసీ మాజీ డైరెక్టర్ బేతపూడి నిర్మల, వైసిపి నాయకులు బేతపూడి ఏసు తదితరులంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.