CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏకీభవిస్తున్నా.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-23 16:08:17.0  )
CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏకీభవిస్తున్నా.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షో(Benefit Shows)లు, టికెట్ల ధరల పెంపు ఇక ఉండబోదని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ(BJP) నేత విష్ణుకుమార్ రాజు(Vishnu Kumar Raju) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బెనిఫిట్ షోలు రద్దు చేయాలని అన్నారు. ఒకవేళ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినా నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమైతే తాను తప్పకుండా ఏకీభవిస్తా అని ప్రకటించారు. ఒకరు చనిపోయారని విషయం ముందే తెలిసినా అల్లు అర్జున్(Allu Arjun) వెంటనే స్పందించకపోవడం విచారకరం అన్నారు.


Read More..

బెనిఫిట్‌ షోలపై నిషేధం.. సీఎం నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్స్


పురందేశ్వరి(Purandeswari), కిషన్ రెడ్డిలు చరేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం అని అన్నారు. ఇండస్ట్రీ మీద మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్లు సరికాదని అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చాలామంది ఆయనను పరామర్శించారని.. కానీ చనిపోయిన మహిళ కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదని అసహనం వ్యక్తం చేశారు. బెన్‌ఫిట్ షోలు వెయ్యాలనుకుంటే తప్పనిసరి పోలీస్ అనుమతి తీసుకోవాలన్నారు. బెన్‌ఫిట్ షోలను తప్పకుండా ఆపివేయాలన్నదే తన అభిప్రాయమన్నారు.



Next Story

Most Viewed