సీఎం కప్ క్రీడా పోటీల్లో విద్యార్థినికి బంగారు పతకం..

by Sumithra |
సీఎం కప్ క్రీడా పోటీల్లో విద్యార్థినికి బంగారు పతకం..
X

దిశ, గంగాధర : సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన హ్యాండ్ బాల్ క్రీడలో గంగాధర మండలం మధుర నగర్ లో గల సురభి కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థిని యు.దీప్తి ప్రతిభ కనబరచి బంగారు పతకం సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ చిప్ప వీరేశం తెలిపారు. సోమవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలలో హ్యాండ్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన యు.దీప్తికి పాఠశాల కరస్పాండెంట్ వీరేశం ప్రశంసా పత్రంతో పాటు గోల్డ్ మెడల్ ను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చిప్పవీర నర్సయ్య, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొని దీప్తిని అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed