Chiranjeevi: ఫుల్ సంతోషంలో మెగాస్టార్ చిరంజీవి.. అసలేం జరిగిందంటే? (వీడియో)

by Hamsa |
Chiranjeevi: ఫుల్ సంతోషంలో మెగాస్టార్ చిరంజీవి.. అసలేం జరిగిందంటే? (వీడియో)
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఫుల్ సంతోషంలో ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే.. ‘‘ఒక రైతు పంట చేతికి వచ్చినప్పుడు ఎంత ఆనంద పడతారు నేను ఇప్పుడు పొందుతున్నాను. దానికి కారణం ఏంటంటే.. నేను కొన్ని నెలల క్రితం మా పెరట్లో ఓ సొరకాయ(Bottle Gourd ) విత్తనం వేశాను. అది ఇప్పుడు పెద్ద మొక్కగా మారి రెండు కాయలు కాసింది. ఈ రోజు నేను వాటిని కట్ చేస్తున్నాను. నా చెత్తో వేశాను కదా సంతోషంగా ఉంది. ప్రకృతి చాలా గొప్పది. మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి.

మార్కెట్లో కొనుగోలు చేసిన వాటికంటే సహజంగా కాసిన కూరగాయలు(Vegetables) చాలా రుచికరంగా ఉంటాయి’’ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు అంత పెద్ద స్టార్ అయి ఉండి ఇలా చేయడం గ్రేట్ అని ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Vishwambhara). వశిష్ట(Vasishta) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో త్రిష, అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది భారీ అంచనాల మధ్య విడుదల కానుంది.

Advertisement

Next Story