- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంటలో పెళ్లి.. పోలీసులను ఆశ్రయించిన యువతి..
దిశ ప్రతినిధి, వికారాబాద్ : నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు.. దయచేసి పెళ్లి ఆపండి అంటూ బాధిత యువతి పోలీసులకు ఫోన్ చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా, బంట్వారం మండలం పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే బంట్వారం మండలం, తొర్ మామిడి గ్రామానికి చెందిన కాజమీయా కూతురు నేహా (21) ఆదివారం రాత్రి బంట్వారం పోలీసులకు 100 డయల్ ద్వారా ఫోన్ చేసింది. మా తల్లిదండ్రులు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీశైలం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం కరెక్ట్ కాదని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
దీంతో వధువు తల్లిదండ్రులు పెళ్లికి అప్పు చేసి మరీ లక్షలు ఖర్చు పెట్టామని ఎస్ఐ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. యువతి ఫిర్యాదు పట్ల కేసు నమోదు చేసిన పోలీసులు ఏది ఏమైనా 18 ఏళ్లు నిండిన అమ్మాయి ఎవరైనా ఆమె ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకోవాలని, ఆమె ఇష్టం లేకుండా పెళ్లి చేయొద్దు అంటూ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే గతంలోనే వారి చుట్టాల అబ్బాయితో నేహకు ఎంగేజ్మెంట్ జరిగిందని సమాచారం. అయితే తనకు ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేక తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారని, అది నచ్చని నేహ పోలీసులకు ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ అయిన చుట్టాల అబ్బాయితో పోలీసులు గ్రామానికి చేరేముందే వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.