అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాపై అదిరి పోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనంటూ..

by Kavitha |   ( Updated:2024-12-23 09:17:21.0  )
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాపై అదిరి పోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనంటూ..
X

దిశ, సినిమా: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతుందని లాస్ట్ ఇయర్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. హారిక హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో నాగ వంశీ.. బన్నీతో త్రివిక్రమ్ తీయబోయే సినిమా స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయని, రాజమౌళి కూడా టచ్ చేయని జానర్‌లో ఈ మూవీ ఉండబోతుందని, దేశంలో ఎవ్వరూ చూడని ఓ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం అని చెప్పిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో మరోసారి నాగవంశీ చేసిన కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌కి సంబంధించిన అప్డేట్‌ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమా షూటింగ్ మార్చి నెల నుంచి స్టార్ కానుంది. ఫస్ట్ హీరో లేని సీన్స్ షూట్ చేస్తారు. అనంతరం బన్నీ జూన్‌లో జాయిన్ అవుతాడు’ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Also Read....

బెనిఫిట్‌ షోలపై నిషేధం.. సీఎం నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్స్

Advertisement

Next Story

Most Viewed