తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నిరాశ పరిచిన గ్రూప్‌లు ఇవే

by Mahesh |
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నిరాశ పరిచిన గ్రూప్‌లు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఇంటర్ ఫలితాల (Inter results)ను ఈ రోజు(మంగళవారం) మధ్యాహ్నం 12.30 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka).. విద్యాశాఖ అధికారుల (Education officials)తో కలిసి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 66.89 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, సెకండియ‌ర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. అలాగే, ఫస్టియర్‌లో బాలికల ఉత్తీర్ణత 73.83 శాతంగా, బాలుర ఉత్తీర్ణత 57.83 శాతంగా ఉండగా, సెంకర్ ఇయర్‌లో బాలికల ఉత్తీర్ణత 73.83 శాతంగా, బాలుర ఉత్తీర్ణత 57.83 శాతంగా ఉంది. ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలే సత్తా చాటారు.

ఇదిలా ఉంటే ఇంటర్ ఫలితాల్లో రెండు గ్రూపులు అనుకున్న స్థాయి కంటే దారుణమైన ఫలితాలు ఇచ్చి విద్యార్థులతో పాటు, కాలేజీల యాజమాన్యాలకు షాక్ ఇచ్చాయి. ఇంటర్ లో ఎక్కువమంది తీసుకునే గ్రూపుల్లో సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు (CEC and HEC groups) ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా సాధారణ విద్యార్థులు(మాథ్స్, సైన్స్ సబ్జెక్ట్ రానివారు) ఈ కొర్సుల్లో చేరుతారనే విషయం తెలిసిందే. అయినప్పటికీ తాజా ఫలితాల్లో ఈ గ్రూపుల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఫెయిల్ అయ్యారు. ఇందులో ఫస్టియర్ HEC గ్రూపులో 8959 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే.. కేవలం 3092 మంది విద్యార్థులు మాత్రమే ఫేస్ అయ్యారు. అంటే కేవలం 34.51 శాతం విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు.

అలాగే CEC పరీక్షలకు 92,745 మంది హాజరు కాగా 42,259 మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. ఇది మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 45.56 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితియ సంవత్సరం HEC పరీక్షలను 9031 మంది రాయగా వారిలో 4178 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇది మొత్తం విద్యార్థుల్లో 46.26 శాతం మాత్రమే అలాగే CEC రెండవ సంవత్సరం పరీక్షలను 1,03713 మంది విద్యార్థులు రాయగా.. వారిలో 48,658 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే మొత్తం విద్యార్థుల్లో 46.92 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.



Next Story

Most Viewed