- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending : క్రిస్మస్ స్ట్రెస్‌ఫుల్ సీజన్‌గా మారకూడదంటే.. మీరు చేయాల్సింది ఇదే..
దిశ, ఫీచర్స్ : డిసెంబర్ అంటేనే ఇయర్ ఎండింగ్ సీజన్. మిగతా రోజులతో పోలిస్తే అన్ని విషయాల్లోనూ కాస్త ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఏడాదంతా తమకు కలిసొచ్చిందని సక్సెస్ ఫుల్‌ను సెలబ్రేట్ చేసుకునే వారు కొందరైతే.. తాము కోల్పోయిన సంబంధాలు, ఆర్థిక కష్టాలు లేదా నెరవేరని లక్ష్యాలకు సంబంధించి బాధాకరమైన భావాలతో మరికొందరు పోరాడుతుంటారు. అయితే పెయిన్‌ఫుల్ రిమైండర్స్ కొందరిలో అసమర్థత భావాలకు లేదా బాధాకరమైన ఫీలింగ్స్‌కి కారణం అవుతుంటాయి. కాగా ఇలాంటి ఒత్తిడి సమయంలోనే ఆనందాన్ని, ఐక్యతను చాటిచెప్పే పండుగ క్రిస్మస్ కూడా వస్తుంది. దీనిని ఆనందంగా జరుపుకోవాలంటే ముందుగా మీరు ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో చూద్దాం.
* మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలు, బాధ్యతలు, అలాగే వాటిని ఎదుర్కోగల సామర్థ్యం మధ్య అసమతుల్యత కారణంగా ఒత్తిడి పుట్టుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్రిస్మస్ సెలవులను ‘పర్ ఫెక్ట్’గా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోనలు కూడా అందుకు కారణం అవుతాయి. అలాగే అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేయడం, హాలిడే షాపింగ్, అలంకరణ (decorating), సామాజిక పరస్పర చర్యలు( socializing), సంప్రదాయం, కట్టుబాట్లను సమతుల్యం చేయడంలో ఇబ్బందులు, నిరుత్సాహం వంటివి అలసిపోయిన భావాలకు దారితీస్తాయి. అయితే మానసికంగా ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మీ సంతోషం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
*కొందరికి క్రిస్మస్ లోన్లీనెస్ లేదా ప్రియమైన వారికి దూరం అవడం వంటి ఫీలింగ్స్‌ను హైలెట్ చేస్తుంది. ఫ్యామిలీ విజిట్స్ స్ట్రెస్‌ఫుల్‌గా మారవచ్చు. అభిప్రాయాలు లేదా అలవాట్లు బంధువులతో పరస్పర చర్యల వంటివి వైరుధ్యాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలా అనేక రూపాల్లో క్రిస్మస్ సీజన్ పలు మానసిక ఒత్తిళ్లకు కారణం అయినప్పటికీ, ఎదుర్కొనే మార్గాలు అనేకం ఉన్నాయంటున్నారు నిపుణులు. మీరు ఏం ఆశించాలో మీ మెదడుకు తెలిసినప్పుడు, ఒత్తిళ్లను ఎదుర్కోవడం, ఇతర సమస్యలను అధిగమించడం సులువవుతుంది. అందుకోసం ముందుగా ప్లాన్ చేయడం, మీ ఆలోచనలను నియంత్రించుకోవడం వంటివి చేయాలి. ఉదాహరణకు క్రిస్మస్ డిన్నర్ వండటం మీకు ఒత్తిడిని కలిగించే విషయమైతే, కుటుంబ సభ్యుల్లో మరొకిరి ఆ పనిని అప్పగించవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా అనేక విషయాల్లో ప్రత్యామ్నాయంపై ఫోకస్ చేయవచ్చు.
*ఫెస్టివల్ స్ట్రెస్ ఎదుర్కోవాలంటే కొన్ని సరిహద్దులను సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇతరులు అడిగిన ప్రతిదానికీ అంగీకరించడం కంటే ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. అలాగే మీకంటూ ఓన్ బౌండరీస్ క్రియేట్ చేసుకోండి. సొంత అభిప్రాయాలను, సరిహద్దులను కలిగి ఉండటంవల్ల, వాటిని అర్థం చేసుకోవడంవల్ల మీ సమయాన్ని, వనరులను సమర్థవంతంగా కేటాయించడంలో మీకు సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
* క్రిస్మస్ ఒత్తిడిని అధిగమించడంలో మరో ముఖ్యమైన విషయం గిఫ్ట్స్ కోసం ఖర్చు చేయడంలో పరిమితులు పెట్టుకోండి. అలాగే అవసరం లేకున్నా అన్ని కార్యక్రమాలకూ హాజరవడం వంటివి తగ్గించుకోండి. ఇవి మీ ఖర్చును, ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే ప్రతీదీ మీ నియంత్రణలో ఉండదని గుర్తించడం వల్ల కూడా మీలో ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు క్రిస్మస్ విందులో ఇతర వ్యక్తులు ప్రవర్తించే విధానాన్ని లేదా మీరు కొనుగోలు చేసిన గిఫ్ట్‌పై ఇతరులు రియాక్ట్ అయ్యే తీరును మీరు కంట్రోల్ చేయలేరు. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఆ సమయంలో స్వీకరించడం నేర్చుకుంటే క్రిస్మస్ ఫెస్టివల్ ఒత్తిడిని, సవాళ్లను అధిగమించే వేదికగా మారి, మీలో సంతోషానికి కారణం అవుతుంది.
Read More..
Dishti: దిష్టి తీసిన వస్తువులు తొక్కితే చెడు శక్తి వెంటాడుతుందా? దీనిలో నిజమెంత?