- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Konda Surekha: చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహిస్తాం
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ అభివృద్ధి(Warangal Development)పై గత ప్రభుత్వాలు మాటలే చెప్పాయి.. కానీ తాము చేతల్లో చేసి చూపిస్తామని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్(Hyderabad)ను మించి వరంగల్‌ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మైకుల ముందు ఊదరగొట్టిన గత పాలనకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనకు ఉన్న తేడా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా వరంగల్(Warangal)లో ఇందిరా మహిళా శక్తి సభ ఉంటుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం మాదిరి కాదని.. తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందు పెడతామని కీలక ప్రకటన చేశారు.