- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI: వచ్చే ఏడాది క్లౌడ్ సేవలు ప్రారంభించనున్న ఆర్‌బీఐ
దిశ, బిజినెస్ బ్యూరో: భారత సెంట్రల్ బ్యాంక్ వచ్చే ఏడాది సరికొత్త పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. ఇది దేశీయంగా ఉన్న ఆర్థిక సంస్థలకు సరసమైన ధరలకే స్థానిక క్లౌడ్ డేటా నిల్వను అందించనుంది. అంతర్జాతీయంగా ఉన్న బడా కంపెనీలు ఇప్పటికీ క్లౌడ్ సర్వీసుల విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కొత్త ఆలోచనను ఆచరణలో పెట్టనుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తక్కువ ధరలో డేటా స్టోరేజీ సౌకర్యాలను అందించాలని నిర్ణయించింది. ఓ సెంట్రల్ బ్యాంక్ ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే తొలిసారి. 2025లో పైలట్ ప్రాజెక్ట్‌గా క్లౌడ్ స్టోరేజీ సేవలను ప్రారంభించనుంది. దీనికోసం స్థానిక ఐటీ కంపెనీల సహకారం తీసుకోనుంది. ఈ నిర్ణయంతో ప్రస్తుతం క్లౌడ్ విభాగంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్, ఐబీఎం క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ లాంటి గ్లోబల్ కంపెనీల ఆధిపత్యాన్ని కట్టడి చేయనుంది. దశల వారీగా విస్తరించి క్లౌడ్ సేవల వినియోగంలో దూరంగా ఉన్న చిన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సహకారం అందించనున్నారు. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న భారత్‌లో క్లౌడ్ సేవల మార్కెట్ గతేడాది రూ. 70 వేల కోట్ల నుంచి 2028 నాటికి రూ. 2 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఇందులో ఎక్కువ విదేశీ కంపెనీల హవా ఉంటుందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక పేర్కొంది.