- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GST Council Meeting: డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..!
దిశ,వెబ్‌డెస్క్: వస్తు సేవల పన్ను(GST) కౌన్సిల్ తదుపరి మీటింగ్(Meeting) కు సంబంధించిన డేట్ ఖరారైంది. వచ్చే నెల డిసెంబర్ 21వ తేదీన జీఎస్‌టీ మండలి(GST Council) సమావేశం కానుంది. ఈ మేరకు జీఎస్‌టీ కౌన్సిల్ సోషల్ మీడియా 'ఎక్స్(X)' వేదికగా ప్రకటించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అధ్యక్షతన 55వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం రాజస్థాన్(Rajasthan)లోని జైసల్మేర్(Jaisalmer) వేదికగా జరగనుందని పేర్కొంది. ఈ భేటీకి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఈ క్రమంలో వచ్చే జీఎస్‌టీ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రీమియంలు(Health Insurance Premium), టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం(Term Life Insurance Premium)లపై జీఎస్‌టీ నుంచి మినహాయించాలనే మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయంపై ఈ కౌన్సిల్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే 20-లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లు, సైకిళ్లు, నోట్‌బుక్‌లపై పన్ను రేట్లను 12 నుంచి 5 శాతానికి తగ్గించడంపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా 54వ జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఢిల్లీ(Delhi)లో జరిగిన విషయం తెలిసిందే.