- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూ బిగినింగ్స్ అంటూ స్టార్ యాంకర్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
దిశ, సినిమా: యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన కామెడీ టైమింగ్స్, పంచులతో ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌టైన్ చేస్తాడు. ఇక లేడీ యాంకర్ లాస్యతో అనేక షోల్లో యాంకరింగ్ చేసి ఎంతో ఫేమస్ అయ్యారు. ఇక తెరపై వీరి జోడీ చూసి వీరిద్దరూ నిజంగా లవ్‌లో ఉన్నారా అనే సందేహం రాకమానదు. కానీ సడెన్‌గా ఏమయిందో ఏమో కానీ లాస్యతో షోలు చేయడం మానేశాడు. ఇక లాస్య కూడా మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే రవి కూడా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈయన ‘బిగ్ బాస్’ రియాల్టి షోలోకి కంటెస్టెంట్‌గా వెళ్లి.. అక్కడ కూడా తన గేమ్స్, కామెడీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా రవి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో గృహ ప్రవేశం ఫొటోలు షేర్ చేస్తూ.. న్యూ బిగినింగ్ అనే క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్స్ కంగ్రాట్యులేషన్ అంటూ విష్ చేస్తున్నారు. మరి మీరు యాంకర్ రవి హౌస్ వార్మింగ్ పార్టీ ఫొటోలను చూసేయండి.