Tripti Dimri: అది నిజంగా నా విజయమే.. ‘యానిమల్-2’ కోసం ఎదురుచూస్తున్నా: త్రిప్తి డిమ్రీ

by Hamsa |
Tripti Dimri: అది నిజంగా నా విజయమే.. ‘యానిమల్-2’ కోసం ఎదురుచూస్తున్నా: త్రిప్తి డిమ్రీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. ఇక గత ఏడాది రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ‘యానిమల్’ సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటుంది. ఇక ఈ ఏడాది ‘బ్యాడ్ న్యూజ్’(Bad News) మూవీతో ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా నేషనల్ క్రష్‌గా కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టింది. రీసెంట్‌గా ఈ అందాల భామ మరో అచీవ్‌మెంట్(Achievement) కూడా సాధించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇటీవల గూగుల్ ఎక్కువ మంది ఏ సెలబ్రిటీ గురించి సెర్చ్ చేశారో లిస్ట్‌ను విడుదల చేసింది.

అయితే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లందరినీ వెనక్కు నెట్టి నెంబర్‌వన్‌గా త్రిప్తి నిలిచింది. దీంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ మారిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, త్రిప్తి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా గురించి తెలుసుకోవడానికి ఇంత మంది ఉత్సాహ పడ్డారంటే అది నా విజయమే. నా కోసం గూగుల్ సెర్స్ చేశారంటే నమ్మలేకపోతున్నాను. ఈ క్రేజ్‌కు కారణం మాత్రం ‘యానిమల్’ సినిమా. సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga) వంగాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ‘యానిమల్-2’(Animal-2) మూవీ కోసం ఎంతో ఈగర్‌గా వెయట్ చేస్తున్నాను. అందులోనూ అందరూ మెచ్చేలా నా పాత్ర ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed