- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారికి అన్ని విధాల నష్టం కలిగించింది గత ప్రభుత్వమే.. మంత్రి అచ్చెన్న సంచలన ఆరోపణలు

దిశ, వెబ్ డెస్క్: రైతులకు అన్నీ రకాలుగా నష్టం కలిగించింది వైసీపీ ప్రభుత్వమేనని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achennayudu) ఆరోపించారు. కూటమి ప్రభుత్వం (Coalition Government) రైతులకు చేస్తున్న మేలు పై ట్విట్టర్ వేదికగా స్పందించిన అచ్చెన్న.. వైసీపీ (YCP) అధికారంలో ఉండగా రైతులు పడిన కష్టాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. బీమాను అస్తవ్యస్తం చేసి రైతులను అన్ని విధాలా వైసీపీ ప్రభుత్వంలో (YSRCP Governemnt) ఇబ్బందులు పెట్టారని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) హయాంలో రైతులకు బీమా లేదు, సూక్ష్మ సేద్యం లేదు, వ్యవసాయ యంత్రీకరణ లేదు, ఎరువులు సక్రమంగా అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతుల (Rayalaseema Farmers) కోసం తిరిగి సూక్ష్మ సేద్యం రాయితీపై అందిస్తోందని తెలిపారు. అలాగే వడగళ్ల వాన వలన నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇక ఐదేళ్ల పాటు రైతులను అన్ని విధాలా ఇబ్బందులు పెట్టిన వైఎస్ జగన్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శలు చేశారు. మీ పాలనలో రైతులకు రాయితీలు లేవు.. ఎరువులు సక్రమంగా అందలేదు.. సూక్ష్మ సేద్యం లేదు.. వ్యవసాయ యంత్రీకరణ లేదు.. అన్ని రకాలుగా రైతులకు నష్టం కలిగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP Party) ప్రభుత్వమేనని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.