Ap: బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్

by srinivas |   ( Updated:2025-03-24 16:16:22.0  )
Ap: బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌(YCP leader and rowdy sheeter Borugadda Anil Kumar)కు నరసరావుపేట కోర్టు(Narasaraopet Court) రిమాండ్ విధించింది. ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో పీటీ వారెంట్‌(PT warrant)పై ఆయనను నరసరావుపేట తీసుకొచ్చి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో అనిల్‌కు ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్‌పై కేసు నమోదు అయింది. ఈ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇదే కేసులో బెయిల్ మంజూరు అయింది. అయితే తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి బెయిల్ పొడిగించుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజమండ్రి జైలులో లొంగిపోయారు. ఈ కేసులోనూ హైకోర్టు బోరుగడ్డ అనిల్ రిమాండ్‌ను పొడిగించింది.

Next Story

Most Viewed