- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఎంపీలు ఈటల రాజేందర్(Etela Rajender), డీకే అరుణ(DK Aruna) అరెస్ట్ అయ్యారు. లగచర్ల బాధితులను పరామర్శించడానికి వెళుతున్న వారిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకొని నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingi Police Station)కు తరలించారు. వీరితో పాటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy)ని సైతం మొయినాబాద్ వద్ద అడ్డుకొని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా, లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్(Vikarabad Collector)పై, అధికారులపైన దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
దీంతో దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరోవైపు ఈ ఘటన సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్‌లో జరుగడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. అయితే తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫార్మా బాధితులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి నేడు ఫిర్యాదు చేశారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపైన, పొలీస్‌లపైన ఫిర్యాదు చేశారు.