- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుఃఖసాగరంలో గురుకులం…రేలింగ్ పైనుంచి పడి విద్యార్థిని మృతి
దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులం ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయింది. స్థానిక గురుకులంలో 9వ తరగతి చదువుతున్న సాథియా మెహరీన్ (14) అనే విద్యార్థిని ప్రమాద వశాత్తు రెలింగ్ పైనుంచి కిందపడి మృతి చెందింది. ఈ సంఘటనకు చెందిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మృతురాలు సాథియా మెహరీన్ జహీరాబాద్ పట్టణంలోని అబ్దుల్ హకీం జమాలి కాలనీకి చెందిన మొహమ్మదీ బేగం, ఆసీఫ్ ల మొదటి సంతానం. గత నాలుగు సంవత్సరాలుగా మృతురాలు ఇక్కడే చదువుతుంది. ఆమెతో పాటు ఆమె చెల్లెలు కూడా ఈ గురుకులంలోనే చదువుతోంది. స్థానిక గురుకులంలోని దినచర్య ప్రకారం సాయంత్రం స్టడీ అవర్స్ పూర్తిచేసుకుని భోజనం అనంతరం డార్మెట్రికి వెళ్లి నిద్ర పోతారు.
రోజు మాదిరిగానే శనివారం రాత్రి కూడా అన్ని ముగించుకొని డార్మెట్రీకి వెళ్లే క్రమంలో రేలింగ్ పైనుంచి కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను గమనించిన తోటి విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడి , పెద్దగా అరిచారు. వెంటనే భవాని టీచర్, ఏఎన్ఎం సులోచన, అతిక్ ఎలక్ట్రీషన్ అక్కడికి చేరుకుని అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ సహాయంతో తీవ్ర గాయాలతో బాధపడుతున్న క్షతగాత్రురాలిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం జిల్లా ఆసుపత్రి సంగారెడ్డి, అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు సమాచారం. చిరాగ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తనకున్న ఆరుగురు సంతానంలో పెద్దదైన, చురుకైన అమ్మాయి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా రాత్రి వేళలో ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే గురుకుల పాఠశాలలో ఉంటున్నారని విద్యార్థులు ఆరోపించారు. ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ ఉండరన్నారు. గురుకులంలో ప్రిన్సిపాల్ ఇతర సిబ్బంది ఉండేవిధంగా నివాస సౌకర్యం(క్వార్టర్స్) ఉన్నప్పటికీ సమీపంలోని పట్టణంలోనే ఉంటున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన రోజు కూడా ప్రిన్సిపల్ రుబీనా గురుకులంలో లేరని తెలిసింది. ఐదు నెలల క్రితమే సదరు ప్రిన్సిపల్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ పై వచ్చారని తెలిసింది.