- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూ భారతిని తీసుకొచ్చాం
దిశ, వేములవాడ : గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తించి దానిని బంగాళాఖాతంలో వేసి భూ భారతిని అమల్లోకి తీసుకువచ్చామని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, జనవరిలో రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని పేర్కొన్నారు. రైతులందరినీ రుణ విముక్తి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని, కానీ ఆర్థిక పరిస్థితుల దృష్యా ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పజెబితే బీఆర్ఎస్ పాలనలో అప్పులమయం చేశారని మండిపడ్డారు. వారి హయాంలో రూ.ఏడు లక్షల కోట్ల అప్పుచేసి జీతాలు, పెన్షన్లు సరైన సమయానికి ఇవ్వలేదని, గ్రామపంచాయతీలకు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదన్నారు.
కానీ తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనప్పటికీ రెండు లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ చేశామని, మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం, రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుందని, ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే ఏ పార్టీ నాయకులైనా ప్రజా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఒకవైపు ప్రజా ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చూస్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, ప్రజలు ఈ విషయాలన్నిటిని గమనించాలని కోరారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలపై మంత్రి స్పందిస్తూ హైదరాబాద్ కేంద్రంగా శాంతిభద్రతలకు సంబంధించి ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి స్పష్టంగా వివరణ ఇచ్చారని, సీఎం చెప్పినప్పటికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడిన మాటలను ఆయన వివేకం, విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
ముందుగా బండి సంజయ్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చిన అనంతరం ఈ విషయంపై స్పందిస్తే బాగుంటుందని హితవు పలికారు. ప్రభుత్వం ఎవరిపైనా కక్ష చూపడం లేదని, శాసనసభలో ఒక వ్యక్తి చర్చించడం కాదని ప్రజా సమస్యలపై చర్చ చేయమని అడగాలన్నారు. ఫార్ములా వన్ రేస్ కు సంబంధించి నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవాలని కేటీఆర్ కు సూచించారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా ఇంకా మంత్రివర్గంలో కొనసాగుతున్నారని, ఎవరెస్ట్ శిఖరం వంటి ఎత్తైన పార్లమెంటు భవనం వద్ద ఎవరో చేసిన తప్పిదానికి రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేశారని, ప్రజాస్వామ్యంపై మాట్లాడే ముందు పురంధేశ్వరి ఈ విషయాన్ని ఆలోచించాలని, అన్నింటికన్నా ముఖ్యంగా ఆమె రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవాలని సూచించారు.