అసెంబ్లీ వేదికగా జగన్ చిట్టా విప్పిన ఆర్థిక మంత్రి కేశవ్

by srinivas |   ( Updated:2024-11-18 12:33:33.0  )
అసెంబ్లీ వేదికగా జగన్ చిట్టా విప్పిన ఆర్థిక మంత్రి కేశవ్
X

దిశ వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ(AP Assembly) వేదికగా జగన్ ప్రభుత్వ(Jagan Government) బకాయిల చిట్టాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) విప్పారు. ఏపీ బడ్జెట్‌(AP Budget)పై చర్చ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. జగన్ తప్పులను ఎత్తిచూపుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును వివరించారు. గత జగన్ ప్రభుత్వం చిన్న పిల్లలకు సంబంధించిన పౌష్టికాహారం చిక్కి, కోడిగుడ్లకు మూడు సంవత్సరాలపాటు బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని గుర్తు చేశారు. మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) చొరవతో తమ ప్రభుత్వం వెంటనే ఆ బిల్లులను చెల్లించిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను గత వైసీపీ ప్రభుత్వం 10 లేదా 18వతేదీన ఇచ్చేదని, కానీ కూటమి ప్రభుత్వం 1వ తేదీనే జీతాలు చెల్లిస్తోందని చెప్పారు.

‘‘విభజన హామీలను అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. ప్రధాని మోడీతో తమకున్న సాన్నిహిత్యంతో అమరావతి(Amaravati)కి రూ.12,500 కోట్లను తీసుకొచ్చాం. గంజాయి(Marijuana) నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మా ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు ఉచితంగా బాగ్స్, పాఠ్యపుస్తకాలు గత వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. మేము మళ్ళీ పునరుద్దరించాం. పాత ఫీజు రీయింబర్స్‌‌మెంట్ విధానాన్ని మళ్ళీ అమలు చేస్తున్నాం. ప్రీ మెట్రిక్,పోస్ట్ మెట్రిక్, స్కాలర్ షిప్‌లను విడుదల చేశాం. సుమారు 6 వేల దేవాలయాల ధూప దీప నైవేద్యాలకు గత ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే, కూటమి ప్రభుత్వం 10 వేల రూపాయలు ఇస్తుంది. అర్చకులకు పదివేల నుంచి రూ.15 వేలు ఇస్తున్నాం.’’ అని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed