- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అరుదైన వ్యాధి..ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
దిశ, గాంధారి: దేవుడు కరుణించి తమకు మగబిడ్డను ప్రసాదించాడని ఆనందించి 10 సంవత్సరాలు గడవకముందే..దేవుడు ఆడించిన వింత నాటకంలో పసి బాలుడు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రపంచంలోనే అరుదైన వ్యాధులలో ఒకటైన గులియాన్ భారీ సిండ్రోమ్ వ్యాధి రూపంలో పిల్లాడిని అల్లాడిస్తుంది. తమ కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండే బాలుడు ఐసీయూలో అలా నిశ్చల స్థితిలో చూసి రోదిస్తున్న తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. వివరాలలోకి వెళితే..కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన బెజుగం ప్రసాద్ కు 11 సంవత్సరాల కుమారుడు అయిన బెజుగం శ్రేయన్ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండగా.. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. దీంతో జీబి సిండ్రోమ్ వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. అయితే చికిత్స కోసం దాదాపు ఒక రోజుకు లక్షల్లో కూడుకున్న మాటే..
ఇప్పటివరకు 40 లక్షల వరకు ఖర్చు
తమకంటూ ఉన్నదల్లా అమ్మి దాదాపు 40 లక్షల వరకు ఖర్చు చేశామని తండ్రి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తండ్రి మాట్లాడుతూ..రోగ నిరోధక శక్తి కణాలు తగ్గడంతో..ఈ వ్యాధి వచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. రోగ నిరోధక శక్తి కణాలను పెంచేందుకు బాబుకు ఐ3,ఐవి ఇంజక్షన్లను కొనసాగిస్తూ..ఉంటే తప్ప డాక్టర్లు కూడా ఏం చెప్పలేమన్నారు. అంతేకాకుండా బాబు ఎంత బరువు ఉంటాడో ఆ బరువు కు రెండింతలు 20 గ్రాములు ఇంజక్షన్ ఐవీఐ త్రీలు అంటే 40 కిలోల బరువు ఉంటే 80 గ్రాముల ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కేవలం 20 గ్రాముల ఐవీ ఐ3 ఖర్చు ఒక లక్షకు పైగా ఉంటుందని, బాబుకు 80 గ్రాముల ఇంజక్షన్ చెయ్యాలంటే ఒక లక్ష అరవై వేల రూపాయలు కావాల్సి ఉంటుందన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
తమ బాబుని ఈ వ్యాధి బారి నుంచి బయటపడే విధంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాబుకు అయ్యే ఖర్చులు ప్రభుత్వం భరిస్తే తమకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని తల్లిదండ్రులు తమ గోడును వ్యక్తం చేశారు.