- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, ప్రొటీన్ లోపం ఉన్నట్లై!
దిశ, ఫీచర్స్: శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే పోషకాలు చాలా అవసరం. లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ ఏవి తక్కువైనా దాని ప్రభావం శరీరంపై పడుతుంది. శరీర పనితీరుకు సరిపడా ప్రొటీన్లను తీసుకోవడం మంచిది. లేకుంటే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల ప్రొటీన్ లోపం వస్తుంది. దీని కారణంగా శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ తగ్గిపోతాయి. ఇది ఇన్‌ఫెక్షన్లు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
ఆహారం ద్వారానే శరీరానికి ప్రొటీన్లను అందించాలి. రోజులో కావాల్సినంత ప్రొటీన్లు తీసుకోకపోతే అది లోపంగా మారుతుంది. ఈ లక్షణాలు ద్వారా ప్రొటీన్ లోపాన్ని తెలుసుకోవచ్చు. అలసట, పాదాల్లో వణుకు, అధికంగా జుట్టు రాలడం, పీరియడ్స్ క్రమం తప్పడం, చర్మ సమస్యలు, ఆహారం ఆలస్యంగా జీర్ణమవడం, కండరాల బలహీనత, కాళ్ల నొప్పులు, గోళ్లు పెళుసుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే ప్రొటీన్ చాలా అవసరం. శరీరంలోని యాంటీబాడీలు పెరిగేందుకు ప్రొటీన్లు సహాయపడతాయి. ఇవి తక్కువగా ఉండే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ప్రొటీన్ పొందే మార్గాలు:
కూరగాయలు, ఆకుకూరలు, బాదం, వాల్‌నట్స్, పిస్తా, చేపలు, కోడిగుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. చియా సీడ్స్, పప్పు ధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేస్తాయి. పాలు,పెరుగు, యగర్ట్ సహా పాలఉత్పత్తుల్లో ప్రొటీనలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజువారి డైట్‌లో భాగంగా తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి పోషణను అందించి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.