ORR టెంటర్లపై సిట్ విచారణకు CM రేవంత్ ఆదేశం

by Gantepaka Srikanth |
ORR టెంటర్లపై సిట్ విచారణకు CM రేవంత్ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) నిర్ణయాల వల్లే రాష్ట్రానికి 65 శాతం ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయంగా హైదరాబాద్‌ రాణించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చేయాల్సిన పనులన్నీ చేస్తోందని తెలిపారు. ఓఆర్ఆర్ టెండర్ల(ORR Tenters)పై చాలా కాలంగా చర్చ జరుగుతోందని.. కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే టెండర్లు కట్టబెట్టారని అన్నారు. అంతేకాదు.. ORR టెండర్లపై సిట్‌ విచారణకు ఆదేశిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హరీష్‌రావు(Harish Rao) కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. విధివిధానాలు కేబినెట్‌లో చర్చించి విచారణ చేస్తామని అన్నారు.

ఎన్నికల ముంగిట ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజ్‌కు ఇవ్వటంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగింది. వైఎస్‌ఆర్‌(YSR) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోయింది. ఓఆర్‌ఆర్‌, శంషాబాద్‌ విమానాశ్రయం(Shamshabad Airport) వల్ల రాష్ట్ర ఆదాయం పెరిగింది. కాంగ్రెస్‌ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్లే ఆదాయం పెరిగింది. రాష్ట్ర బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగిందంటే.. కాంగ్రెస్‌ నిర్ణయాలే కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు ORR టెండర్లపై తాను విచారణ కోరలేదని.. అయినా స్వాగతిస్తున్నానని హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story