Rahul gandhi: రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

by vinod kumar |
Rahul gandhi: రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో 50 శాతం రిజర్వేషన్లను తొలగిస్తామని, అంతేగాక కులగణన నిర్వహిస్తామని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) హామీ ఇచ్చారు. కులగణన అతిపెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల(Maharashtra assembly elections) సందర్భంగా సోమవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. నవంబర్ 20న జరిగే అసెంబ్లీ ఎన్నికలు రెండు సిద్ధాంతాల పోరుగా అభివర్ణించారు. ఫాక్స్‌కాన్‌, ఎయిర్‌బస్‌తో సహా రూ.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోడీ మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించారని, దీంతో రాష్ట్రంలోని యువత ఉద్యోగాలు కోల్పోయారన్నారు.

‘ఏక్ హై తో సేఫ్ హై’ అనే బీజేపీ నినాదంపై స్పందించిన రాహుల్ దీనిపై ఎగతాళి చేశారు. మహారాష్ట్ర ప్రజల కంటే పారిశ్రామికవేత్త గౌతం అదానీ ప్రయోజనాలకే మహాయుతి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ, గౌతం అదానీల పోస్టర్‌ను బయటకు తీసి.. వాటిని చూపెడుతూ ‘ఇద్దరు కలిసి ఉన్నంత కాలం వారు సురక్షితంగా ఉంటారు’ అని ఎద్దేవా చేశారు. అదానీ గ్రూప్‌కు చెందిన ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ మ్యాప్‌ను చూపించి ముంబై సంపదకు ప్రతీక అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ప్రయోజనాలకు మాత్రమే ధారావి ఉపయోగపడుతుంని విమర్శించారు. టెండర్లు ఎలా ఇస్తున్నారో అర్ధం కావడం లేదని, దేశంలోని పోర్టులు, ఎయిర్ పోర్టులు, సంపద అంతా ఒకే వ్యక్తికి అప్పగిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed