POONAM KAUR: ‘ఆ స్టార్ హీరో నన్ను వేధిస్తున్నాడు’.. దుమారం రేపుతున్న పూనమ్ కౌర్ ట్వీట్

by Kavitha |   ( Updated:2024-11-18 11:52:03.0  )
POONAM KAUR: ‘ఆ స్టార్ హీరో నన్ను వేధిస్తున్నాడు’.. దుమారం రేపుతున్న పూనమ్ కౌర్ ట్వీట్
X

దిశ, సినిమా: పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక అప్పటి నుంచి సామాజిక మాద్యమాల్లో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో దుమారం సృష్టిస్తోంది.. గతంలో ఓ స్టార్ డైరెక్టర్ పైన, అలాగే స్టార్ హీరో కమ్ పొలిటిషన్ పైన ట్వీట్‌లు చేస్తూ వార్తల్లో నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ భామ మరోమారు తన ట్వీట్‌తో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

తాజాగా ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. " నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో నాతో పాటు ఒక అమ్మాయి నటించింది. తర్వాత ఆమె హీరోయిన్‌గా కొన్ని రోల్స్ చేసింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆమె సినిమాలు చేయడం ఆపేసింది. అలాగే ఎవరికీ కనిపించకుండా పోయింది. తాజాగా నాకు ఒక డొమెస్టిక్ ఫ్లైట్‌లో కనిపించింది. ఆమె నాతో పెళ్ళికి షాపింగ్‌కి వచ్చినట్లు, తాను ఈ దేశంలో ఉన్నట్లు ఎవరికీ చెప్పొదంటూ రిక్వెస్ట్ చేసింది. ఏమైందని నేను అడగగా ఆమె సమాధానమిస్తూ.. 'ఒక సూపర్ స్టార్ డమ్ కలిగిన హీరో నన్ను వేధిస్తున్నాడు.. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి ఫాలో అవుతున్నాడు. మేము సినిమాలో ఇంటిమెటెడ్ సీన్ చేసినప్పుడు ఆయన నా మొహంపై నిజంగానే భారీ మొత్తంలో ఉమ్మి వేశాడు. డైరెక్టర్ కట్ కూడా చెప్పలేదు' అంటూ చెప్పింది. అలాగే తర్వాత ఆమె ఇండస్ట్రీ వదిలి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళింది. కానీ.. ఆ హీరో వేధింపులు ఇంకా తగ్గలేదని చెప్పింది. ఇదేమి కట్టు కథ కాదు. ఆ అమ్మాయిని నేను హగ్ చేసుకొని ఓదార్చాను" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది.

Advertisement

Next Story