- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి.. ఎక్స్‌గ్రేషియాపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

దిశ, వెబ్ డెస్క్: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan kalyan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా (Exgratia)పై కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా (Thirupati District), చిన్నగొట్టిగల్లు మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన 72 ఏళ్ల ఆర్.సిద్ధయ్య ఏనుగులు దాడి (Elephants Attck)లో దుర్మరణం పాలవడం తీవ్ర బాధాకరమని అన్నారు. అలాగే ఆయన మృతికి సంతాపం వెల్లడిస్తూ కుటుంబ పెద్దను పోగొట్టుకున్న వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి (Deep Condolences) తెలియజేశారు.
ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయించడమైనదని ప్రకటించారు. ఇక ఏనుగుల సంచారాన్ని, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజలకి వన్యప్రాణుల నుంచి, వన్య ప్రాణులకు ప్రజల నుంచి అవాంఛనీయ పరిస్థితులు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తూ.. సిద్ధయ్య ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కళ్యాణ్ ప్రార్థించారు.