Mahesh Kumar Goud: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు

by Gantepaka Srikanth |
Mahesh Kumar Goud: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ(Congress)లో ఉన్న స్వేచ్ఛ ప్రపంచంలో ఏ పార్టీలోనూ ఉండదని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)కు సవాల్ విసిరారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి.. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో తాము ఎంత అభివృద్ధి చేశామో చెబుతాం అని ఛాలెంజ్ చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) ఉండదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి కేసీఆర్(KCR), కొడుకు కేటీఆర్(KTR), కూతురు కవిత(Kavitha) తప్పా ఇంకెవరూ ఆ పార్టీలో ఉండరు అని జోస్యం చెప్పారు. మూసీ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ(BJP) కుమ్మక్కై ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము అధికారంలోకి 11 నెలలు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే కుట్రలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు తెలంగాణను కేసీఆర్‌ ఆగం చేస్తే.. కాంగ్రెస్ రీపేర్ చేస్తోందని చెప్పారు.

Advertisement

Next Story