- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తాగు నీటికి సుద్దనీరే గతి.. రక్షిత నీటి కోసం గ్రామస్థుల నిరసన
దిశ, పోలవరం: సుద్ద నీరుతో ఇక్కట్లు పడుతున్న పట్టించుకోవడం లేదని తక్షణమే సురక్షిత మంచి నీరు అందించాలని సిపిఎం మండల కార్యదర్శి కారం భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రక్షిత నీరివ్వాలని డిమాండ్ చేస్తూ పోలవరం మండలం కోయనాగంపాలెంలో మంచి నీటి ట్యాంక్ వద్ద గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం పోలవరం మండల కార్యదర్శి కారం భాస్కర్ మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా కోయనాగంపాలెం గ్రామంలో మంచినీరు సుద్ద వస్తోందన్నారు. ఆ నీటినే త్రాగి ప్రజలు అనారోగ్య పాలయ్యారన్నారు. గ్రామ ప్రజలకు కనీసం స్వచ్ఛమైన త్రాగు నీరు ఇవ్వడం లో ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. సుద్ద నీరు త్రాగి కాళ్ళు, కీళ్ల వ్యాధులు వస్తున్నాయని అన్నారు.
ప్రజాప్రతినిధులు,అధికారులు గ్రామానికి వచ్చిన సమస్యలు పరిష్కారం చేయడం లేదన్నారు. సుద్ద నీరు వస్తున్న నీటిని పరీక్షలు జరిపి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. గ్రామంలో వేరే చోట బోర్ మోటార్ వేయాలని డిమాండ్ చేశారు. మంచి నీటి కోసం దొండపూడి దూర ప్రాంతాలకు వెళ్లి కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే గ్రామానికి సురక్షిత మంచినీరు అందించాలని లేని పక్షంలో గ్రామస్తులతో ఆందోళన చెప్పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మడివి చలపతిరావు, మీడియం పండు, మడివి రాంబాబు, సవలం జయలక్ష్మి, మీడియం గంగరాజు, సవలం అమ్మాజీ, సవలం దుర్గ, అర్జునమ్మ, మడకం నాగేశ్వరావు, రాజు, వీరాయమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.