భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం..

by Aamani |
భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం..
X

దిశ,కొమురవెల్లి : సిద్దిపేట జిల్లా ప్రముఖ శైవక్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు బారులు తీరారు. నూతన సంవత్సరం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి మల్లికార్జున స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ధర్మ దర్శనం, విశిష్ట దర్శనం, శీఘ్ర దర్శనం, మూడు విభాగాలలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఏ ఈ ఓ బుద్ధి శ్రీనివాస్,ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున,ఆలయ ధర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, వల్ల ద్రి అంజిరెడ్డి, అల్లం శ్రీనివాస్,ఆలయ సిబ్బంది,అర్చకులు,ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు.

నూతన ఈ ఓ గా రామాంజనేయులు బాధ్యతలు స్వీకరణ..

మల్లికార్జున స్వామి ఆలయంలో కొంత కాలంగా ఇంచార్జి ఈ ఓ గా విధులు నిర్వహిస్తున్న బాలాజీ ఇటీవల పదవివీరమణ పొందారు. కాగా మల్లికార్జున స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారిగా హైదరాబాద్ లోని దేవదాయ ధర్మదాయ కమిషనర్ కార్యాలయం లో గెజిటెడ్ సూపరిండెంటెంట్ గా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు ఆదివారం మల్లన్న ఆలయ ఈఓ గా బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Next Story

Most Viewed