- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
Huge Explosion: బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. స్పాట్‌లోనే ఆరుగురు దుర్మరణం

దిశ, వెబ్‌డెస్క్: బాణసంచా (Fire Works) తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన విషాద ఘటన తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విరుద్‌నగర్ (Virud Nagar) జిల్లా పరిధిలోని సాతూర్ (Satur)లో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ దర్ఘటనలో మొత్తం ఆరుగురు కార్మికుల శరీరాలు పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్థులు ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. ఫైరింజన్లతో స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది భారీ ఎత్తున ఎగిసిపడుతోన్న మంటలను రెండు ఫైరింజన్లతో అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read...