రెండు అణు పరీక్షల్లో ఆయన పాత్ర చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు

by srinivas |
రెండు అణు పరీక్షల్లో ఆయన పాత్ర చిరస్మరణీయం:  సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశం రెండు అణు పరీక్షలు నిర్వహించిందని, ఆ సమయంలో శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం(Scientist Rajagopala Chidambaram) చేసిన సేవలు మర్చిపోలేనివని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం ఇవాళ ముంబై(Mumbai) జస్‌లోక్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతిపై ట్విట్టర్ ద్వారా సీఎం చంద్రబాబు(Cm Chandrababu) స్పందించారు. రాజగోపాలం చిదరంబం కుటుంబానికి సానుభూతి తెలిపారు. 1975, 1998లో దేశం నిర్వహించిన అణు పరీక్షల్లో రాజగోపాల చిదంబరం కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. భారతదేశ అణుశక్తి విభాగానికి చిదంబరం నాయకత్వం వహించారని చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story