- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Ponnam : కాంగ్రెస్ తోనే రైతు సంక్షేమం సాధ్యం : మంత్రి పొన్నం ప్రభాకర్
దిశ, వెబ్ డెస్క్ : దేశంలోనూ...రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాల(Congress Governments)తోనే రైతు సంక్షేమం(Farmer Welfare) సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షమ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. రైతు భరోసా(Rythu Bharosa) మార్పులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పొన్నం తిప్పికొట్టారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ఒకే స్వరంతో మాట్లాడుతున్నారని పొన్నం ఆరోపించారు. ఐటీ కడుతున్న వాళ్ళకి..ప్రభుత్వ ఉద్యోగులకు కిసాన్ సమ్మాన్ మీరు ఇవ్వడం లేదన్న సంగతి బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా, భూమిలేని పేదలకు 12 వేలు జనవరి 26 నుండి అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసి, అప్పులతో ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టినప్పటికి మా ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు.
ఇప్పటి వరకు 125 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , 500లకు గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశామని, 40 శాతం డైట్ చార్జీలు పెంచామని, 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామన్నారు. యూపీఏ ప్రభుత్వంలో 72 వేల కోట్ల రుణమాఫీ చేసిన సంగతి మరువరాదన్నారు. గత ప్రభుత్వం 40వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో పెట్టిందని విమర్శించారు. నిన్న రైతు భరోసా ఇస్తామని ప్రకటించి గత రైతుబంధును 12 వేలకు పెంచామని, భూమి లేని పేదలకు సంవత్సరానికి 12 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతు భరోసా మార్పులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా బీజేపీ, బీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. మేము మాట తప్పమా లేదా ప్రజలు నిర్ణయిస్తారని, గుట్టలకు ,రోడ్లు, రాళ్ళు, వ్యవసాయ యోగ్యం లేని భూములకు రైతు భరోసా ఇవ్వాలని ఆ పార్టీలు చెబుతున్నాయా అని పొన్నం ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోడీకి డ్రెస్సింగ్ మీద తప్ప దేశ రైతుల పట్ల శ్రద్ధ లేదన్నారు. బీజేపీకి రైతుల మీద ప్రేముంటే మేము ఇస్తున్న రైతు భరోసాకి మీరు 12 వేలు జమ చేయండని పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు ఏం చేస్తారో చెప్పండన్నారు. మీరు కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారని, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నారా...? 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశారా అని బీజేపీని విమర్శించారు. మీరు రైతులకు మద్దతు ధర ఇస్తామన్నారని, పెన్షన్ ఇస్తామన్నారని ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డులు ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డులు మేం ఇస్తామన్నారు.ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని తెలిపారు. గల్ఫ్ బాధితులకు చరిత్రలో మొదటి సారి 5 లక్షలు ఇచ్చామని తెలిపారు.