Brahmamudi : అందరి ముందు కావ్య ని పొగిడిన రాజ్

by Prasanna |   ( Updated:2025-01-06 08:42:24.0  )
Brahmamudi : అందరి ముందు కావ్య ని పొగిడిన రాజ్
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

ఇందిరా దేవి ఇలా బాధ పడుతుంది.. " మా బావకు అలా అయిన దగ్గర నుంచి ఈ ఇల్లు మొత్తం మారిపోతుంది. అలాగే మనుషుల మధ్య దూరం కూడా పెరిగిపోతుంది. కనీసం కావ్య, రాజ్ అయినా అర్థం చేసుకుంటారనుకున్నా .. వాళ్లు కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఇంకా ఈ ఇంట్లో ఎన్ని చూడాలో చూడాలో ఏంటో? అని ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత రోజు రాజ్, కావ్య ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్లిపోతారు. అక్కడ, జగదీష్ చంద్ర అప్పగించిన దేవుడి నగల ప్రాజెక్ట్‌ పూర్తి కావడంతో ఆ నగలను పరీక్షించి.. లాకర్‌లో పెట్టిస్తారు రాజ్, కావ్యలు. ఇక రాజ్ అందరీ ముందు.. నగలు ఇంత బాగా రావడానికి దాని వెనుక కారణం నువ్వే అని కళావతిని అంటాడు.

ఇక అన్నీ లాకర్‌లో పెట్టి, రేపు వాళ్లకు సబ్మిట్ చేస్తే పని ఐపోతుందని .. రాత్రి అయ్యేసరికి ఇంటికి బయలుదేరతారు. అయితే, అనామిక ముందుగానే ఓ సెక్యూరిటీ గాడ్‌ రెడీ చేసుకుంటుంది. రూ 50 లక్షలు ఇస్తాను.. ఆ నగల్లో ఒరిజినల్ వి నాకు ఇవ్వు .. డూప్లికేట్ వి అక్కడ పెట్టాలని డీల్ చేసుకుంటుంది. ఆ విధంగానే ఆ సెక్యూరిటీ గాడ్ మిగిలిన సెక్యూరిటీ వాళ్లకు మత్తుమందు ఇచ్చి తాగిస్తాడు. వాళ్లు అందరూ పడిపోతారు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Advertisement

Next Story