Lifestyle: వీటిని తినడం అలవాటు చేసుకుంటే.. ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

by Prasanna |
Lifestyle: వీటిని తినడం అలవాటు చేసుకుంటే.. ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. కానీ, ప్రస్తుతం యువత ఫాస్ట్ ఫుడ్ , జంక్ ఫుడ్ లకు అలవాటు పడి అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే, మీ రోజు వారీ డైట్ లో కొన్ని ఆహార పదార్ధాలను చేర్చుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కూరగాయలు

ఆకు కూరలు, బ్రోకలీ, బీట్ రూట్, టమోటో వంటి కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని మనం వారంలో నాలుగు సార్లు తీసుకుంటే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, మీ డైలీ డైట్ లో వీటిని చేర్చండి.

నట్స్

ప్రతీ రోజూ చియా సీడ్స్, అవిసె గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, వాల్ నట్స్, గుమ్మడి గింజలు, బాదంపప్పులు వంటి గింజలను తీసుకోవడం వలన మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు, మీ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.

ప్రోటీన్స్

పెరుగు, చికెన్ , సాల్మన్ ఫిష్, గుడ్లు వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా, చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మూడ్ స్టెబిలైజర్‌లుగా పనిచేస్తాయి. వీటిలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అనేక రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.

ఫ్రూట్స్

సీజనల్ ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. దానిమ్మ, ఆరెంట్ వంటి పండ్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే " విటమిన్ సి " చర్మాన్ని క్లియర్ చేస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story